కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం... ఈ నెల 24 వరకు గ్రామసభలు
- తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామసభలు
- రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు
- గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్న ప్రభుత్వం
దరఖాస్తుల స్వీకరణ కోసం ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ సభలు, వార్డు సభలు కొనసాగనున్నాయి. గ్రామసభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు తెలిపి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు ప్రారంభం కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారుల సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఈ సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలను నిర్వహించనున్నారు.