Telangana: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం... ఈ నెల 24 వరకు గ్రామసభలు

ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి తెలంగాణవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరుగుతున్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు... ఈ నాలుగు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తులను స్వీకరించి గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తుల స్వీకరణ కోసం ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ సభలు, వార్డు సభలు కొనసాగనున్నాయి. గ్రామసభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు తెలిపి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. 

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు ప్రారంభం కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారుల సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఈ సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలను నిర్వహించనున్నారు.
Telangana
Congress

More Telugu News