Encounter: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోల మృతి

10 Maoists Killed In Chhattisgarh Encounter
  • ఇటీవల వరుసగా ఎన్‌కౌంటర్లు
  • ఈ నెల 16న 17 మంది నక్సలైట్ల మృతి
  • తాజాగా చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్
  • 10 మంది నక్సల్స్ మృతదేహాల స్వాధీనం
మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలు ఎన్‌కౌంటర్లతో మావోలను నేలకూలుస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో నక్సలైట్లు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున నెలకు రెండుమూడు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ నెల 16న చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 17 మంది నక్సల్స్ మృతి చెందారు. మృతుల్లో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నట్టు తెలిసింది.  

తాజాగా చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో పదిమంది నక్సలైట్లు మరణించారు. గరియాబంద్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలతోపాటు 207కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కాల్పులు ఆగిన తర్వాత 10 మంది నక్సల్స్ మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Encounter
Chhattisgarh
Maoists

More Telugu News