30న రైల్వేస్‌తో రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరపున బరిలోకి కోహ్లీ
- 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడబోతున్న కోహ్లీ
- ఈ నెల 30న రైల్వేస్‌తో చివరి మ్యాచ్‌లో బరిలోకి
- మెడనొప్పి కారణంగా ఎల్లుండి సౌరాష్ట్రతో మ్యాచ్‌కు దూరం
- దేశవాళీ బాటలో మరింతమంది టీమిండియా క్రికెటర్లు
వరుస వైఫల్యాలు, విమర్శలు, బీసీసీఐ ఆగ్రహం.. ఏదైతేనేం మొత్తానికి టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ బరిలో దిగుతున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్న విరాట్ ఈ నెల 30న రైల్వేస్‌తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో బ్యాట్ పట్టనున్నాడు.
ఈ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటున్న విషయాన్ని కోహ్లీ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడు. ఇక ఎల్లుండి (23న) ఢిల్లీ-సౌరాష్ట్ర మధ్య జరగనున్న మ్యాచ్‌లోనే కోహ్లీ ఆడాల్సి ఉండగా మెడనొప్పి కారణంగా అందుబాటులో ఉండటం లేదు. కాగా, రోహిత్‌శర్మ, జడేజా, రిషభ్‌పంత్, శుభమన్‌గిల్, యశస్వి జైస్వాల్ తదితర ఆటగాళ్లు కూడా రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు.