మరోసారి టారిఫ్ సవరించిన జియో
- యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చిన రిలయన్స్ జియో
- రీచార్జ్ ధరలు భారీగా పెంచిన రిలయన్స్ జియో
- రూ.199 రీచార్జ్ ప్లాన్‌పై ఏకంగా రూ.100ల పెంపు !
అయితే తాజాగా పోస్ట్ పెయిడ్ ధరలను పెంచుతూ రిలయన్స్ జియో షాకింగ్ ప్రకటన చేసింది. రూ.199 ప్లాన్‌పై ఏకంగా రూ.100 పెంచి .. ఇకపై రూ.299 వసూలు చేయనున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు జనవరి 23 నుంచి అమల్లోకి వస్తాయని రిలయన్స్ జియో పేర్కొంది. కాగా ఈ రీచార్జ్ ప్లాన్‌లో నెలకు అన్ లిమిటెడ్ కాల్స్, 25 జిబీ డేటా పొందుతారు. అయితే నూతన యూజర్లు మాత్రం రూ.299కి బదులు రూ.349 తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వెల్లడించింది.