శ్రీవారి భక్తులకు మసాలా వడలు... అన్నప్రసాదం మెనూలో మరో ఐటమ్
- అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్
- టీటీడీ బోర్డు నిర్ణయం
- నేడు ట్రయల్ రన్... 5 వేల వడలు వడ్డింపు
- త్వరలోనే పూర్తిస్థాయి మెనూ
ట్రయల్ రన్ లో భాగంగా నేడు ఐదు వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఈ మసాలా వడలు తయారు చేశారు. కాగా, కొన్ని రోజుల పాటు పరిశీలించి, లోటుపాట్లను సవరించుకుని పూర్తి స్థాయిలో మెనూకి రూపకల్పన చేయనునున్నారు. ఈ మేరకు టీటీడీ కసరత్తులు చేస్తోంది. త్వరలోనే వడలతో కూడిన కొత్త మెనూను టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.