జగన్ సీఎం అయ్యాక ఓ సామాజిక వర్గంపై కక్షగట్టి యుద్ధం చేశారు: ఏబీవీ

   
వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక ఓ సామాజిక వర్గాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) పేర్కొన్నారు. నిన్న విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఓ సామాజిక వర్గంపై కక్ష గట్టి యుద్ధం చేశారని అన్నారు.

2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తనతోపాటు ఎంతోమంది ఉద్యోగులను ఇబ్బంది పెట్టారని, సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కరోనా టీకాకు, ఎన్నికల కమిషనర్‌కు కూడా కులం రంగు పులిమారని ఏబీవీ విమర్శించారు. 


More Telugu News