రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ’సంక్రాంతికి వ‌స్తున్నాం‘.. ఐదు రోజుల్లో రూ.161 కోట్లు

విక్టరీ వెంకటేశ్ తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను మూటగట్టుకుంటోంది. వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టిందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

శనివారం ఒక్కరోజే ఈ సినిమా రూ.31 కోట్లను కలెక్ట్ చేసిందని, ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఐదు రోజుల్లో రూ.161 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అధికారికంగా వెల్లడించింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లు హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది.

Sankranthiki Vasthunam
Victory Venkatesh
Venky Mama
Five Days Collections
Movie Collections

More Telugu News