చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అంటే కిషన్ రెడ్డి సమాధానం ఇదీ

  • ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి
  • చిరంజీవి బీజేపీలో చేరవచ్చునని ప్రచారం
  • మెగాస్టార్ ను సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్న కిషన్ రెడ్డి
చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరుతారా? అనే చర్చ ప్రారంభమైంది. 

నిన్న కిషన్ రెడ్డి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా, చిరంజీవి అగ్రనటుడు కాబట్టి గౌరవించి తాను పిలుస్తున్నానన్నారు.

బీజేపీ గురించి మాట్లాడుతూ... పార్టీలో మండలస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ఎంపిక కొనసాగుతోందన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, అధ్యక్షుడు ఎవరనేది ముందే నిర్ణయమవుతుందన్నారు. కానీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు.


More Telugu News