Narendra Modi: విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది: మోదీ

PM Modi opines on Vizag Steel Plant

  • విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రం కరుణ
  • రూ.11.440 కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటన
  • ప్రధాని మోదీకి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్న కూటమి నేతలు
  • ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నామన్న మోదీ

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో కూటమి నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. 

విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. నిన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించామని మోదీ వెల్లడించారు. ఆత్మ నిర్భర భారత్ ను సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ చర్య చేపట్టామని వివరించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News