RC16: 'ఆర్‌సీ16'పై జ‌గ‌ప‌తిబాబు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

RC16 Update Jagapathi Babu Make Up Video goes Viral

  • రామ్‌చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సీ16'
  • కీల‌క పాత్ర‌ల్లో శివ‌రాజ్ కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్ న‌టులు
  • చాలా కాలం త‌ర్వాత బుచ్చిబాబు ఈ మూవీ కోసం మంచి ప‌ని పెట్టాడ‌న్న జ‌గ్గూ భాయ్‌
  • గెట‌ప్ చూసిన త‌రువాత చాలా తృప్తిగా అనిపించింద‌ని వ్యాఖ్య‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ సంక్రాంతికి 'గేమ్ ఛేంజ‌ర్' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చెర్రీ 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. 'ఆర్‌సీ16' వ‌ర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాలో శివ‌రాజ్ కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

ఈ క్ర‌మంలో తాజాగా జ‌గ్గూ భాయ్ ఓ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. తాను షూటింగ్‌కు ముందు మేక‌ప్ వేసుకుంటున్న వీడియోను 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పంచుకున్నారు. "చాలా కాలం త‌ర్వాత బుచ్చిబాబు 'ఆర్‌సీ16' కోసం నాకు మంచి ప‌ని పెట్టాడు. గెట‌ప్ చూసిన త‌రువాత నాకు చాలా తృప్తిగా అనిపించింది" అని మేక‌ప్ వీడియోను షేర్ చేశారు. 

ఇక ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ బాణీలు అందిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

  • Loading...

More Telugu News