ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్.. ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- ఫార్ములాా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు కేటీఆర్
- ఈడీ కార్యాలయం వద్ద మోహరించినం 200 మంది పోలీసులు
- బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
ఇంకోవైపు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలిస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ మినహా మరెవరినీ అనుమతించలేదు.