నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి గోయల్
- కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్
- పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం
- ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగారెడ్డి
నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో అందులో పేర్కొనలేదు. నిజామాబాద్‌లో బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు నిన్నప్రకటించారు.