ఢిల్లీలో మంత్రి కిష‌న్ రెడ్డి సంక్రాంతి వేడుక‌లు.. ప్ర‌త్యేక అతిథిగా చిరంజీవి

  
న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నివాసంలో జరిగే సాంప్రదాయ "సంక్రాంతి - పొంగల్" వేడుకలకు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. దీనికోసం కొద్దిసేప‌టి క్రితం ఆయ‌న బేగంపేట్ నుంచి ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. అలాగే ఈ సెల‌బ్రేష‌న్స్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెల‌కొంది. సంక్రాంతి వేడుక‌ల కోసం ఇప్ప‌టికే చాలా మంది న‌గ‌రాల నుంచి సొంతూళ్ల‌కు చేరుకున్నారు. ఇవాళ‌, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు పండుగ ఉండ‌డంతో ప‌ల్లెల‌న్నీ సంబ‌రాల కోసం సుంద‌రంగా ముస్తాబ‌య్యాయి.


More Telugu News