నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు చంద్రబాబు కుటుంబం కానుకలు

Chandrababu family gifts to Naravaripalle women
  • సంక్రాంతి వేడుకల్లో నారా, నందమూరి కుటుంబాలు
  • వివిధ పోటీలతో సందడిగా నారావారిపల్లె
  • పోటీలను తిలకించిన చంద్రబాబు దంపతులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు పరిశీలించారు. 

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ... అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలను కూడా చంద్రబాబు దంపతులు తిలకించారు.
Go Back to Shorts
Chandrababu
Nara Bhuvaneswari
Nara Brahmani
Naravaripalle
Sankranti

More Telugu News