పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను బహిరంగంగా బెదిరించిన జగన్

  • వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన జగన్
  • తిరిగి వెళ్తుండగా డీఎస్పీపై వైసీపీ నేతల ఫిర్యాదు
  • తన వద్దకు పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చిన జగన్
‘రెండు లేదంటే నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోవచ్చు. ఆ తర్వాత మీ కథ ఉంటుంది’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను బెదిరించారు. జగన్ బంధువు వైఎస్ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియల అనంతరం తిరిగి వెళ్తూ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న జగన్ అక్కడ ఈ హెచ్చరిక చేశారు.

విచారణలో డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నారని వైసీపీ నేతలు జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీని జగన్ తన వద్దకు పిలిచారు. ఆయన ఇద్దరు సీఐలతో కలిసి జగన్ వద్దకు వెళ్లారు. మురళీ నాయక్‌ను చూడగానే జగన్‌లో కోపం కట్టలు తెచ్చుకుంది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వం రెండు లేదంటే నాలుగు నెలల్లో మారిపోవచ్చని, అప్పుడు మీ పని ఉంటుందని హెచ్చరించారు.

డీఎస్పీ ఏం మాట్లాడకుండా, విని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, టీడీపీ నేతలపై అనుచిత పోస్టుల కేసులో వర్రా రవీందర్‌రెడ్డిని విచారిస్తున్నది డీఎస్పీ మురళీ నాయకే. ఈ నేపథ్యంలోనే ఆయనను జగన్ హెచ్చరించినట్టు తెలిసింది. అందరి ముందు జగన్ ఆయనను బెదిరించడం చర్చనీయాంశమైంది.


More Telugu News