కాశీలో స్టీవ్ జాబ్స్ సతీమణి పూజలు
- మహా కుంభమేళాలో పాల్గొననున్న యాపిల్ కో ఫౌండర్ భార్య
- భారతీయ సంప్రదాయ దుస్తుల్లో విశ్వేశ్వరుడి దర్శనం
- స్వయంగా తోడ్కొని వెళ్లిన స్వామి కైలాశానంద్ గిరి జి మహారాజ్
పావెల్ హిందూ సంప్రదాయం పాటిస్తారని, మహా కుంభమేళాలో పాల్గొనేందుకు భారత దేశం వచ్చారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విగ్నంగా పూర్తయ్యేలా చూడాలంటూ కాశీ విశ్వనాథుడిని ప్రార్థించినట్లు స్వామి కైలాశానంద్ గిరి జి మహారాజ్ చెప్పారు. కాగా, సంప్రదాయ దుస్తుల్లో లారెన్స్ పావెల్ ఆలయ దర్శనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.