China: బెంగళూరులో చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్... స్పందించిన సీఎం సిద్ధరామయ్య

Efforts would be made to stop spread of HPM virus says Karnataka CM
  • ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావుతో మాట్లాడానన్న సీఎం
  • మంత్రి కూడా సంబంధిత అధికారులతో సమావేశమయ్యారన్న సిద్ధరామయ్య
  • వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడి
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా తేలింది. దేశంలో మూడు కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌గా తేలడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.

ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయం తెలియగానే ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావుతో మాట్లాడానన్నారు. మంత్రి కూడా వెంటనే సంబంధిత అధికారులతో సమావేశమైనట్లు చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
China
Karnataka
Bengaluru
HMPV Virus

More Telugu News