శ్రీవారి భక్తులను ఢీకొట్టిన అంబులెన్స్.. ఇద్దరి మృతి
- తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ప్రమాదం
- శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వెళుతుండగా ఘోరం
- మృతులు అన్నమయ్య జిల్లా చెంపాలపల్లి వాసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు నుంచి కాలినడకన తిరుమలకు వెళుతున్న భక్తులను మదనపల్లె నుంచి తిరుపతికి రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్ (108 వాహనం) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన శ్రీవారి భక్తులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ(40), లక్ష్మమ్మ(45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురు భక్తులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.