15 ఏళ్ల బాలుడితో ప్రేమ.. కలిసి జీవించేందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన యువతి!
- చెన్నైలోని ఎంజీఆర్ నగర్‌లో ఘటన
- ట్యూషన్‌కు వచ్చే బాలుడితో ప్రేమలో పడిన యువతి
- మరో స్నేహితుడి సాయంతో పుదుచ్చేరికి
- అక్కడ కలిసి జీవించాలని నిర్ణయం
- ముగ్గురిని చెన్నై తీసుకొచ్చిన పోలీసులు
బాలుడికి ట్యూషన్ చెబుతున్న మహిళ చెల్లెలు, కేకే నగర్‌కు చెందిన రాహుల్, బాలుడు కలిసి పుదుచ్చేరికి వెళ్లినట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి ముగ్గురినీ చెన్నైకి తీసుకొచ్చారు. బాలుడు, యువతి ప్రేమించుకుంటున్నారని, కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్న వారు రాహుల్ సాయంతో పుదుచ్చేరికి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. యువతిపై కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న ఆల్ ఉమెన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.