ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన సీఎం చంద్రబాబు... స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు
- నేడు నూతన సంవత్సరాది
- చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసిన మంత్రులు, అధికారులు
- రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- అనంతరం మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి రాక
- చంద్రబాబు రాకతో సందడిగా మారిన పార్టీ కేంద్ర కార్యాలయం
అంతకుముందు, చంద్రబాబు నివాసానికి మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత చంద్రబాబు విజయవాడలో రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. చంద్రబాబు వస్తారని తెలియడంతో, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళగిరి తరలివచ్చారు.