ఫెరారీ కారుకు ఎడ్లబండే దిక్కయింది.. ఇదిగో వీడియో!
- బీచ్ రైడింగ్ చేస్తుండగా ఇసుకలో ఇరుక్కుపోయిన ఫెరారీ కారు
- రాయ్‌గఢ్‌లోని రేవ్‌దండా బీచ్‌లో ఘటన
- ఎడ్లబండి సాయంతో కారును లాగిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ముంబయికి చెందిన ఇద్దరు వ్యక్తులు .. తమ ఫెరారీ కారులో రేవ్‌దండా బీచ్‌కి వెళ్లి రైడింగ్ చేస్తూ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా, అకస్మాత్తుగా కారు టైర్లు ఇసుకలో కూరుకుపోయాయి. దీంతో అక్కడి వారంతా వచ్చి కారును బయటకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం కనబడలేదు. అదే సమయంలో అటుగా వెల్తున్న ఓ ఎడ్లబండి కనిపించడంతో వీరు అతన్ని సాయం కోరారు. ఫెరారీ కారు ముందు భాగాన్ని తాడుతో కట్టి ఎడ్లబండి ముందుకు పోనివ్వడంతో కారు ఎట్టకేలకు బయటపడింది. దీంతో ఖరీదైన కారుకు ఎడ్లబండి దిక్కయ్యిందన్న కామెంట్స్ వినబడుతున్నాయి.