నా తండ్రి చనిపోతే సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదు: కాంగ్రెస్‌పై ప్రణబ్ కూతురు ఆగ్రహం
- నా తండ్రికి సీడబ్ల్యూసీ నివాళులు అర్పించలేదని మండిపాటు
- ఈ విషయంలో కాంగ్రెస్ నేత తనను తప్పుదోవ పట్టించారని ఆరోపణ
- రాష్ట్రపతులకు నివాళులు అర్పించే సంప్రదాయం లేదని చెప్పారని విమర్శ
ఈ నేపథ్యంలో శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ అధిష్ఠానంపై ఎక్స్ వేదికగా మండిపడింది. మాజీ రాష్ట్రపతి, తన తండ్రి ప్రణబ్ 2020లో మృతి చెందారని, సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీలోని ఓ సీనియర్ నేత తనను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. అయితే తన తండ్రి డైరీని చదివిన తర్వాత అది నిజం కాదని తెలిసిందన్నారు. కేఆర్ నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించినట్లు డైరీలో ఉందన్నారు.