కవిత పాల్గొన్న కార్యక్రమంలో 'సీతక్క' అంటూ ప్రసంగం ప్రారంభించిన సిక్కు నేత... వీడియో ఇదిగో
- కవిత నివాసంలో 40 బీసీ సంఘాలతో సమావేశం
- సభను ఏర్పాటు చేసిన సీతక్కకు నమస్కారం అన్న సిక్కు నేత
- పొరపాటును సరిదిద్దుకున్న సిక్కు నేత
- 'సీతక్క' అనడంతో నవ్విన కవిత
ఈ సమావేశంలో ఒక్కో నేత మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఓ సిక్కు సంఘం నేత కూడా మాట్లాడారు. "సభ ఏర్పాటు చేసిన మా సీతక్కకు నమస్కారం" అంటూ ఆ సిక్కు సంఘం నేత ఒకింత తడబాటుకు గురయ్యారు. దీంతో కవిత సహా కార్యక్రమంలోని వారంతా నవ్వేశారు. ఆ వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నారు. "సారీ కవితక్క" అంటూ తిరిగి ప్రసంగం కొనసాగించారు.