మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- నేడు ఢిల్లీకి చేరుకొని నేరుగా మన్మోహన్ సింగ్ నివాసానికి సీఎం
- మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ సీఎం
- మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఢిల్లీ సీఎం అతిశీ, కేజ్రీవాల్
మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు.