కోహ్లీ ఇన్కం ట్యాక్స్ రూ.66 కోట్లా..? భారత క్రికెటర్లు ఎంతెంత ఐటీ కడుతున్నారో తెలుసా?
- మన దేశంలో క్రికెట్ అంటే విపరీతమైన మోజు
- అందుకే క్రికెటర్లకు ఆటతోపాటు ప్రకటనలతోనూ ఆదాయం
- ఏటా వందల కోట్ల సంపాదన.. పదుల కోట్లలో ఆదాయ పన్ను కడుతున్న తీరు
కోహ్లీ టాప్.. ధోనీ సెకండ్..
క్రికెట్ కింగ్ గా పేరుపొందిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో కూడా టాప్ లో ఉన్నారు. ఆయన 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.66 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. ట్యాక్స్ రేట్ల ప్రకారం చూస్తే ఆయన ఆదాయం ఆ ఒక్క ఏడాదిలో సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెట్ దేవుడుగా పేరుపొందిన సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
2023-24లో అత్యధిక ఐటీ కట్టిన క్రికెటర్లు | ||
ర్యాంక్ | క్రికెటర్ పేరు | కట్టిన పన్ను |
1 | విరాట్ కోహ్లీ | రూ.66 కోట్లు |
2 | ఎంఎస్ ధోనీ | రూ.38 కోట్లు |
| 3 | సచిన్ టెండూల్కర్ | రూ.28 కోట్లు |
| 4 | సౌరవ్ గంగూలీ | రూ.23 కోట్లు |
| 5 | హార్దిక్ పాండ్యా | రూ.13 కోట్లు |
| 6 | రిషభ్ పంత్ | రూ.10 కోట్లు |
| 7 | అజింక్య రహనే | రూ.8 కోట్లు |
| 8 | జస్ ప్రీత్ బుమ్రా | రూ.7 కోట్లు |
| 9 | శిఖర్ ధావన్ | రూ.6 కోట్లు |
| 10 | కేఎల్ రాహుల్ | రూ.5 కోట్లు |