అశ్విన్ రిటైర్‌మెంట్‌పై భార్య ప్రీతి అశ్విన్ భావోద్వేగం.. సుదీర్ఘ నోట్ విడుదల
- ఎలా స్పందించాలో అర్థం కాలేదన్న ప్రీతి అశ్విన్
- గత 13-14 ఏళ్లుగా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఎమోషనల్
- ఇకపై కుటుంబానికి సమయం వెచ్చించాలని అశ్విన్‌కు సందేశం
‘‘డియర్ అశ్విన్... క్రికెట్ కిట్ బ్యాగ్ ఎలా పట్టుకోవాలో తెలియని నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేడియాల వరకు మిమ్మల్ని నేను అనుసరించాను. మిమ్మల్ని చూస్తూ నేర్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు పరిచయం చేసిన ప్రపంచం నాకు గౌరవాన్ని అందించింది. క్రికెట్‌లో రాణించేందుకు మీరు ఎంత కృషి, క్రమశిక్షణతో మెలిగారో నేను చూశాను. అవార్డులు, అత్యుత్తమ గణాంకాలు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు, ప్రశంసలు, రికార్డులు వేటినీ పట్టించుకోకుండా నైపుణ్యాలను మీరు నిరంతరం పదును పెట్టుకున్నారు. ఇకపై మీకు నచ్చిన నిబంధనల ప్రకారం నడుచుకోండి. మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. రోజంతా మీమ్స్ షేర్ చేస్తూ ఉండండి. మన పిల్లల క్రమశిక్షణను పర్యవేక్షించండి’’ అని ప్రీతి అశ్విన్ రాసుకొచ్చారు.