Sri Tej: సంధ్య థియేటర్ ఘటన: బాలుడు శ్రీతేజ్ మెదడుకు డ్యామేజి జరిగిందన్న డాక్టర్లు

Doctors releases Sri Tej health bulletin
  • డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్స్
  • హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట
  • రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు
  • రెండు వారాలుగా చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి గత రెండు వారాలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 

తాజాగా, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు బులెటిన్ విడుదల చేశారు. ఇవాళ ప్రభుత్వం తరఫున నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా బాలుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రి వద్దకు వచ్చారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. 

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ మెదడుకు డ్యామేజి జరిగిందని బులెటిన్ లో పేర్కొన్నట్టు సీవీ ఆనంద్ తెలిపారు. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. మెదడు దెబ్బతిన్న కారణంగా చికిత్స చాలాకాలం కొనసాగించాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారని వివరించారు.
Sri Tej
Health Bulletin
KIMS
Hyderabad
Sandhya Theater Issue

More Telugu News