కాకినాడ జిల్లాలో దారుణం... ముగ్గురు అన్నదమ్ముల హత్య
- సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘటన
- ఓ ఇంటి నిర్మాణం విషయంలో వివాదం
- కత్తులతో ఓ కుటుంబంపై దాడి చేసిన ప్రత్యర్థులు
ఇంటి నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. కత్తులతో వచ్చిన 20 మంది ప్రత్యర్థులు ఓ కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అన్నదమ్ములు హతులయ్యారు.
కాగా, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో పడి ఉన్న కత్తులు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.