ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలో సినీ పాత్రికేయులకు విశిష్ట సత్కారం
- ఎన్టీఆర్ సినీ జీవితానికి 75 ఏళ్లు
- పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- సీనియర్ సినీ జర్నలిస్టులకు మెమెంటోల బహూకరణ
కాగా, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఎం చంద్రబాబు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ స్పెషల్ క్యాలెండర్ ను కూడా ఆవిష్కరించారు.
దాంతోపాటే, తారకరామం-అన్న గారి అంతరంగం పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఎన్టీఆర్ సినిమా కెరీర్ విశేషాలు, పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి సమాచారాన్ని, ఆయన గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు.