గుకేశ్‌కు ఎలాన్ మస్క్ కంగ్రాట్స్!
- 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్
- చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ షిప్ కైవసం
- దీంతో మనోడిపై సర్వాత్ర ప్రశంసలు
- గుకేశ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన మస్క్
దీంతో మనోడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా గుకేశ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కంగ్రాట్స్ చెబుతూ మస్క్ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.