బ్రిటన్ లో ఆంధ్రా టెక్కీ దుర్మరణం
- లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి చిరంజీవి
- మిత్రులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం
- డివైడర్ను ఢీకొనడంతో కారు బోల్తా
ఆయన తన కారులో మిత్రులతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.