నా కుక్క ప్రేమకు సాటిలేదంటూ సమంత పోస్ట్.. ఆమె పోస్ట్ కు సెటైరా?
- పెంపుడు శునకం సాషా ఫొటోను అభిమానులతో పంచుకున్న నటి
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
- ఇటీవలే చైతూ ప్రేమ దక్కడం తన అదృష్టమంటూ శోభిత ట్వీట్
సమంత మాజీ భర్త నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. నాగచైతన్య ప్రేమ దక్కడం తన అదృష్టమంటూ శోభిత ధూళిపాళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కు కౌంటర్ గానే సమంత తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిందని, శోభిత పోస్ట్ పై పరోక్షంగా సెటైర్ వేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.