సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కుమార్తెతో తన కుమారుడి పెళ్లి జరిపించిన బీఎస్పీ సీనియర్ నేతకు షాక్!
- పార్టీ నుంచి బహిష్కరించిన అధినేత్రి మాయావతి
- తన వ్యతిరేక వర్గ పార్టీ నేతతో వియ్యం అందుకోవడంపై ఆగ్రహం
- పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ వేటు
బరేలీ డివిజన్‌కు చెందిన సురేంద్రసాగర్ గతంలో కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు. పార్టీలో కీలక పదవులు నిర్వర్తించారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. అయితే, ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ నేతతో సంబంధం కలుపుకోవడం, వివాహానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హాజరు కావడంతో ఆగ్రహించిన మాయావతి పార్టీ నుంచి సురేంద్రసాగర్ను బహిష్కరించారు. అయితే, తానేమీ పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడలేదని, తన కుమారుడికి పెళ్లి మాత్రమే జరిపించానని సాగర్ వివరణ ఇచ్చారు.