స్టెల్లా షిప్ లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల బృందం
- షిప్ లో మల్టీ డిసిప్లినరీ టీమ్ తనిఖీలు
- బియ్యం నమూనాలు సేకరించి నిజానిజాలను తేల్చనున్న బృందం
- షిప్ లో 640 టన్నుల బియ్యం ఉందని జిల్లా కలెక్టర్ ప్రకటన
ఈ షిప్ లో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. బియ్యం స్మగ్లింగ్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సీజ్ ద షిప్' అంటూ ఆయన అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే షిప్ లో అధికారుల బృందం ఈరోజు మరోసారి తనిఖీలను చేపట్టింది.