క్వార్టర్ మందు కొట్టి పోలీస్ స్టేషన్ లో హంగామా చేసిన హైదరాబాద్ మహిళ... వీడియో వైరల్
- మద్యం మత్తులో పీఎస్ కు వచ్చిన మహిళ
- బ్రీత్ ఎనలైజర్ తో టెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు
- ఇష్టం వచ్చినట్టు ఊదుతూ పోలీసులను బాగా విసిగించిన మహిళ
తాజాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు మద్యం మత్తులో వచ్చిన ఆ మహిళ... పీఎస్ లో హంగామా సృష్టించింది. బ్రీత్ ఎనలైజర్ లో ఊదమని చెబితే.... ఆమె ఇష్టం వచ్చినట్టు ఊదడంతో... ఇలా కాదమ్మా... మేం చెప్పేంత వరకు ఊదుతూనే ఉండాలి అని పోలీసులు చెప్పారు.
దాంతో తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ... నేను బరాబర్ క్వార్టర్ తాగానని చెబుతుంటే, ఇంకా ఎందుకు ఊదాలి? అంటూ పోలీసులను తిరిగి ప్రశ్నించింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా బాగా విసిగించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.