Viral Videos: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. వైరల్ వీడియో ఇదిగో!

monkey with Gada in Hanuman temple viral video Here
షార్ట్స్‌లో చూడండి
అదొక ఆంజనేయ స్వామి ఆలయం... అక్కడికి ఒక వానరం వచ్చింది. హనుమంతుడి గద తీసుకుని భుజంపై పెట్టుకుని కూర్చుంది. అది చూసిన భక్తులు ఆ వానరానికి బొట్టు పెట్టి, దండ వేశారు. ఆ తర్వాత కూడా వానరం అలా... ఆంజనేయస్వామి విగ్రహం ముందే గద పట్టుకుని కూర్చుంది. ఇది తెలిసిన చాలా మంది హనుమంతుడే తమను దీవించడానికి ఇలా వచ్చాడంటూ ఆ ఆలయానికి పోటెత్తారట.

ఇది ఎక్కడ జరిగిందో, ఎవరు మొదట వీడియో తీసి అప్ లోడ్ చేశారనే స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ వీడియో వైరల్ గా మారింది. చాలా అకౌంట్లలో ఈ వీడియోను అప్ లోడ్ చేస్తున్నారు. వేల కొద్దీ వ్యూస్ నమోదవుతున్నాయి.
Go Back to Shorts
Viral Videos
offbeat
X Corp
Twitter
Hanuman

More Telugu News