మేడ్చల్ సీసీఐ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం... కోట్లలో ఆస్తి నష్టం
- పత్తి గోదాంలో భారీగా ఎగిసిన మంటలు
- ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం
- భారీ ప్రమాదం కారణంగా కుప్పకూలిన గోదాం
ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. భారీ ప్రమాదం కావడంతో గోదాం కుప్పకూలింది. మంటలను గమనించిన కార్మికులు గోదాం నుంచి బయటకు పరుగు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.