తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో కీలక మార్పులు
- ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం
- ప్రస్తుతం ఇంటర్నల్కు 20 మార్కులు
- ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయం
ఇక నుంచి 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయించింది.