Telangana: తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో కీలక మార్పులు

Key changes in Telangana SSC marks system
  • ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం
  • ప్రస్తుతం ఇంటర్నల్‌కు 20 మార్కులు
  • ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయం
పదో తరగతి మార్కుల విధానంలో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం పదో తరగతికి 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.

ఇక నుంచి 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
Telangana
SSC
Congress

More Telugu News