ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

cm chandrababu reviewed sand rates
  • ఇసుక రవాణాలో అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదన్న సీఎం  
  • ఇసుక దొరకడం లేదన్న మాట ప్రజల నుంచి   వినిపించకూడదని సూచన  
  • డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రీచ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై గనుల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్‌లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదని పునరుద్ఘాటించారు.

ఇసుక తవ్వకాలు, రవాణాను అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక దొరకడం లేదన్న మాట ఎవరి నోటా వినిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లిన ప్రతి వినియోగదారుడితో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించారు. ఇందు కోసం వినియోగదారులకు ఫోన్లు చేసే ఐవీఆర్ఎస్‌ను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్)తో అనుసంధానించాలని చంద్రబాబు ఆదేశించారు.

ఇసుకకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రీచ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. మాన్యువల్, సెమీ మెకనైజ్డ్‌గా తవ్వకాలకు అవసరమైన అనుమతులు అన్నీ తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా ఖర్చులు మరింత తగ్గించేలా చూడాలని సూచించారు. రవాణా ఖర్చు తగ్గించేందుకు ఏమి చేయాలో సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

వ్యక్తిగత వినియోగానికి ఇసుక అవసరమైన వారికి ఎటువంటి ఆంక్షలు, జాప్యం లేకుండా ఇసుక లభించేలా చూడాలన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించకుండా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘా కోసం తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఇసుక రవాణాలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.   
Go Back to Shorts
cm chandrababu
sand
sand quarring
Andhra Pradesh

More Telugu News