విశాఖ విమానాశ్రయంలో అత్యంత ప్రమాదకర థాయ్‌లాండ్ బల్లులు స్వాధీనం

Blue tongue lizards seized at Vizag Airport
  • థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించిన అధికారులు
  • నీలి రంగు నాలుక కలిగిన బల్లులు మూడు, వెస్ట్రన్ బల్లులు మూడు స్వాధీనం
  • ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
విశాఖపట్నం విమానాశ్రయంలో థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ప్రమాదకర బల్లులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి వీటిని అక్రమంగా తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు, డీఆర్ఐ అధికారులు గుర్తించారు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు మూడు, వెస్ట్రన్ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్నారు.

డీఆర్ఐ, అటవీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. ఈ బల్లులను డీఆర్ఐ అధికారులు విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఈ బల్లులను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Thailand
Lizard

More Telugu News