నేడు తమిళనాడును తాకనున్న ఫెంగల్ తుపాను.. స్కూళ్లు మూత
- నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
- తీవ్ర రూపం దాల్చి నేడు తుపాను బలపడే అవకాశం
- తమిళనాడు వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
- పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
నాగపట్టణం, మయిలాదుతురై, తిరువారూర్ ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా రేపటి వరకు ఓ మాదిరి వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడలూర్, మయిలాదుతురైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ నిన్ననే రెడ్ అలెర్ట్ జారీచేసింది. చెన్నైలో నేటి వరకు ఎల్లో అలెర్ట్ జారీచేయగా, పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్‌పట్‌లకు బుధ, శనివారాల మధ్య ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.