సీఐడీ మాజీ అధికారి విజయపాల్ ను రేపు గుంటూరు తరలించనున్న పోలీసులు

  • రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయపాల్ అరెస్ట్
  • ఈ రాత్రికి ఒంగోలు పీఎస్ లోనే విజయపాల్!
  • రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన పోలీసులు
రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో సీఐడీ విశ్రాంత అధికారి విజయపాల్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. విజయపాల్ ను ఈ రాత్రికి ఒంగోలు పోలీస్ స్టేషన్ లో ఉంచనున్నారు. ఆయనను రేపు ఉదయం గుంటూరు తరలించనున్నారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేశారు. 

ఈ కేసులో విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నేడు ఉదయం 11 గంటల నుంచి ఆయనను ప్రశ్నించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. విజయపాల్ రిమాండ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. రేపు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.

Vijayapal
Police
Guntur
Ongole
Raghu Rama Krishna Raju
Custodial Torture Case

More Telugu News