ఢిల్లీలో సుప్రసిద్ధ బుక్ స్టోర్స్ ను సందర్శించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

  • ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్
  • ఆక్స్ ఫర్డ్, ఫకీర్ చంద్ బుక్ స్టోర్స్ ను సందర్శించిన పవన్
  • పలు కొత్త పుస్తకాలను పరిశీలించిన వైనం
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన, ఢిల్లీలోని ప్రముఖ బుక్ స్టోర్స్ ను సందర్శించారు. కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఆక్స్ ఫర్డ్ బుక్ స్టోర్, ఖాన్ మార్కెట్ లో ఉన్న ఫకీర్ చంద్ బుక్ స్టోర్ ను సందర్శించారు. 

పవన్ కల్యాణ్ కు పుస్తక పఠనం అత్యంత ఇష్టం అని తెలిసిందే. చరిత్ర, సాహిత్యం, ప్రపంచ సామాజిక స్థితిగతుల గురించి ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. ఆ ఆసక్తి కొద్దీ... నేడు ఢిల్లీలోని రెండు బుక్ స్టోర్లలో కొత్త పుస్తకాలను పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Pawan Kalyan
Book Stores
Books
New Delhi

More Telugu News