సీఎం చంద్రబాబును కలిసిన చాగంటి

Chaganti met CM Chandrababu
  • ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన చాగంటి
  • నేడు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ
  • విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంపొందించాలన్న చంద్రబాబు
ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. సచివాలయానికి వచ్చిన చాగంటి... చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు... విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రయత్నించాలని చాగంటికి సూచించారు. 

మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నైతిక విలువల పతనానికి కారణమవుతున్న అంశాల నుంచి విద్యార్థులు, యువతను దూరంగా మళ్లించాలని సూచించారు. 

ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు... చాగంటికి శాలువా కప్పి, వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. కాగా, చాగంటి కోటేశ్వరరావు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కూడా కలిశారు.
Go Back to Shorts
Chandrababu
Chaganti Koteswara Rao
Govt Adviser
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News