Viral Video: నాకు ఇలాంటి లక్షణాలున్న భర్త కావాలి.. ముంబై తాజ్ హోటల్ వద్ద ప్లకార్డుతో యువతి.. వీడియో ఇదిగో!

Mumbai Girl Holds Placard In Search Groom At Hotel Taj
  • కాబోయే భర్త తనకంటే పొడవు ఉండాలని, ముంబైకి చెందిన వాడే అయి ఉండాలని కండిషన్లు
  • చాలామంది ఆమె ఫొటోలు, వీడియోలు తీసుకున్న వైనం
  • ఆమె ధైర్యం ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
గడ్డాలు గీసుకోని అబ్బాయిలు తమకు వద్దంటూ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమ్మాయిలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనకు దిగారు. ‘నో క్లీన్ షేవ్.. నో లవ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది కాస్తా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తాజాగా, ముంబైలోని తాజ్ హోటల్ ముందు ఓ అమ్మాయి ఇలానే ప్లకార్డుతో కనిపించింది. తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఈ లక్షణాలు ఉండాలంటూ తన వివరాలతోపాటు కండిషన్లు కూడా రాసుకొచ్చింది. పర్యాటక ప్రాంతమైన ఇక్కడి ఆమె ప్రదర్శన సోషల్ మీడియాకెక్కి వైరల్ అవడమే కాదు.. విపరీత చర్చకు దారితీసింది.

సయాలీ సావంత్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇన్‌స్టాలో ఆమెకు 78 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘మ్యారేజ్ బయోడేటా’ అని ఆమె తన ప్లకార్డుపై రాసుకొచ్చింది. అందులో తనకు కాబోయే భర్త తనకంటే పొడవు ఉండాలని, తప్పకుండా ముంబైకి చెందినవాడే అయి ఉండాలని పేర్కొంది. వీటితోపాటు మరికొన్ని షరతులు కూడా విధించింది.

ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాబోయే భర్తకు ఈ లక్షణాలు ఉండాలన్న ఆమె ప్లకార్డు ప్రదర్శన వేలాదిమందిని ఆకర్షించింది. చాలామంది ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరీ ఇలా నడిరోడ్డుపై ప్రదర్శన ఏంటంటూ ఇంకొందరు పెదవి విరిచారు.
Viral Video
Mumbai
Hotel Taj
Groom

More Telugu News