'క‌న్న‌ప్ప' విడుద‌ల తేదీ వ‌చ్చేసింది.. థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేది ఎప్పుడంటే!

Kannappa Movie Released on 2025 April 25th
  • మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో 'క‌న్న‌ప్ప'
  • 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • కీల‌క పాత్ర‌ల్లో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'క‌న్న‌ప్ప'. ఈ మూవీ విడుద‌ల తేదీని తాజాగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు చిత్రం యూనిట్‌ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టింది. 

"పరమ శివుని గొప్ప భక్తుడు కన్నప్ప గురించి ఇప్ప‌టివ‌ర‌కు చెప్పని కథను చూసేందుకు మీ క్యాలెండర్‌లో డేట్‌ను మార్క్ చేసుకోండి. 2025 ఏప్రిల్ 25 వెండి తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది! పురాణ సినిమా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి!" అని చిత్ర‌బృందం ట్వీట్ చేసింది.  

కాగా, కన్నప్పలో మోహ‌న్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజ‌ల్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ నెలకొంది. ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. 
Go Back to Shorts
Kannappa
Manchu Vishnu
Tollywood

More Telugu News