hydra commissioner: తన ఇంటిపై వస్తున్న వార్తల పట్ల క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

hydra commissioner clarity on his house issue
షార్ట్స్‌లో చూడండి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురానగర్‌లో నివాసం ఉంటున్న ఇల్లు కూడా బఫర్ జోన్‌లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హైడ్రా ఆధ్వర్యంలో బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా, మొహమాటానికి తావు లేకుండా పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా కూల్చి వేస్తున్న క్రమంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సొంత ఇల్లు కూడా ఒకప్పటి పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. మధురానగర్‌లో 44 ఏళ్ల క్రితం తమ తండ్రి ఏపీవీ సుబ్బయ్య దీనిని నిర్మించారని, ఆ  ఇంట్లోనే తాము ఉంటున్నామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్క్‌గా మార్చారన్నారు. కృష్ణకాంత్ పార్క్‌కు మా ఇంటికి మధ్య వేలాది ఇళ్లు ఉన్నాయన్నారు. చెరువు కట్ట దిగువన పది మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. 

సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము నివాసం ఉంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉందన్నారు. తమ ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటరు దూరంలో ఉందని పేర్కొన్నారు. తాము ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో లేదు అనేది వాస్తవమని అందరూ గ్రహించాలని కోరారు. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని కోరుతూ ఫొటోలు కూడా రంగనాథ్ విడుదల చేశారు.  
.
Go Back to Shorts
hydra commissioner
Ranganath
Bufffer Zone

More Telugu News