త‌మ్ముడి బ‌ర్త్‌డే.. 'బేబీ' హీరోయిన్ ఎమోష‌న‌ల్ పోస్టు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌మ్ముడి బ‌ర్త్‌డే.. 'బేబీ' హీరోయిన్ ఎమోష‌న‌ల్ పోస్టు!

Vaishnavi Chaitanya Birthday Wishes to Brother Nitish
  • నేడు హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య త‌మ్ముడు నితీశ్ పుట్టిన‌రోజు
  • ఈ సంద‌ర్భంగా తమ్ముడిపై ప్రేమ‌ను కురిపిస్తూ వైష్ణ‌వి ఇన్‌స్టా పోస్టు
  • ప్రపంచంలోనే మోస్ట్ అమేజింగ్ బ్ర‌ద‌ర్ అంటూ కితాబు
  • నితీశ్‌ను త‌మ్ముడిగా పొంద‌డం త‌న అదృష్ట‌మ‌న్న యువ న‌టి
బేబీ సినిమా సూప‌ర్‌హిట్‌తో వైష్ణ‌వి చైత‌న్య‌ ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. అంత‌కుముందు ప‌లు చిత్రాల్లో చిన్న‌చిన్న పాత్ర‌ల్లో క‌నిపించిన ఆమె బేబీతో హీరోయిన్‌గా మారారు. మొదటి చిత్రంతోనే ఘ‌న విజ‌యాన్ని అందుకున్నారు. దాంతో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. 

అయితే, ఈరోజు ఆమె సోద‌రుడు నితీశ్ పుట్టిన‌రోజు. ఈసంద‌ర్భంగా త‌మ్ముడికి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ వైష్ణ‌వి ఇన్‌స్టా వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టారు. "ప్రపంచంలోనే మోస్ట్ అమేజింగ్ బ్ర‌ద‌ర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు! నా కోసం నీవు చేస్తున్న ప్రతిదానికీ ధన్యవాదాలు. నేను ప్రతిరోజూ నవ్వుతూ ఉండేలా నీవు చూసుకుంటావు. నా రోజును అత్యంత‌ శక్తితో, ఆశతో ప్రారంభించడానికి నీవు నాకు ప్రేరణనిస్తావు. 

నీ ప్రేమ, శ్రద్ధతో నా రోజును పూర్తి చేస్తావు. నేను సంతోషంగా, ప్రశాంతమైన మనస్సుతో పడుకునేటట్లు చూసుకుంటావు. అందుకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో నాకు జరిగిన గొప్పదనం నువ్వే. నువ్వు నా పక్కన లేకుండా ఒక్కరోజు కూడా ఊహించలేను. మరెవరూ నీలా నన్ను జాగ్రత్తగా చూసుకోలేరు. నీవు నా సోదరుడువి మాత్రమే కాదు.. నువ్వు నా రాక్‌స్టార్‌, నా గొప్ప వ‌రం, నాకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్.

నేను మీ కోసం సాధ్యమైనదంతా చేస్తాను. నేను నీకు నీ ప్రతి లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తాను. మీ అన్ని ఆనందాల‌కు కార‌ణ‌మ‌వుతాను. నీ కలలు నా కలలు. నీవు నా జీవితంలోకి తెచ్చిన ప్రేమ, నవ్వు, ఆనందానికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. నేను నిన్ను త‌మ్ముడిగా పొందడం నా అదృష్టం. మాట‌ల్లో చెప్పలేని దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను!" అంటూ వైష్ణ‌వి బ్ర‌ద‌ర్‌పై ప్రేమ‌ను కురిపిస్తూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ఇప్పుడీ పోస్టు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  
Advertisement
Vaishnavi Chaitanya
Tollywood
Birthday Wishes

More Telugu News